సౌతిండియా సూపర్ స్టార్ మరో క్రేజీ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. దర్శకుడు లోకేష్ తో కలిసి ఆయన చేస్తున్న కూలీ సినిమా షూటింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభించారు. ఈ కాంబో మూవీపై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కూలీ షూటింగ్ బిగిన్ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. భారీ బడ్జెట్ తో ఈ సన్ పిక్చర్స్ కూలీ చిత్రాన్ని నిర్మిస్తోంది.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే కూలీ అనౌన్స్ మెంట్ సందర్బంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో పోర్ట్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగనుంది. కూలీలో రజినీ కస్టమ్స్ ఆఫీసర్ గా కనిపిస్తారా లేక స్మగ్లర్ గానా అనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.