రజినీకాంత్, మణిరత్నం కాంబోలో రూపొందిన చిత్రం దళపతి. ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సంచలన చిత్రం వచ్చి 30 ఏళ్లు అవుతుంది. అయితే.. ఈ క్రేజీ కాంబోలో దళపతి తర్వాత మరో సినిమా రాలేదు. ఇప్పుడు ఈ కాంబో ఫిక్స్ అయ్యిందని సమాచారం. ఆమధ్య కెరీర్ లో వరుస ప్లాపులతో వెనకబడిన మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీతో విజయం సాధించి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఇక అప్పటి నుంచి స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నారు. అనుకోవడమే కాదు.. చేసి చూపిస్తున్నారు.
చదవండి: ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్న సిద్దు
కమల్ హాసన్ తో మణిరత్నం థగ్ లైఫ్ అనే గ్యాంగ్ స్టర్ డ్రామాను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మణిరత్నం రజినీకాంత్ కు ఓ కథ చెప్పారట. ఆ కథ నచ్చి సినిమా చేసేందుకు రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిసింది.
ఓ వైపు కమల్ థగ్ లైఫ్ పోస్ట్ ప్రొడక్షన్, మరో వైపు రజినీతో చేసే మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారట మణిరత్నం. రజినీకాంత్ ప్రస్తుతం కూలి మూవీలో నటిస్తున్నారు. ఆతర్వాత జైలర్ 2 చేయనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత మణిరత్నంతో మూవీని స్టార్ట్ చేయనున్నారు.