సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ కు సీక్వెల్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ థియేటర్స్ లోకి వచ్చిన జైలర్ సినిమా సూపర్ హిట్టయ్యింది. రజనీకాంత్ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా మారింది. తమిళ బాక్సాఫీస్ వద్ద పలు కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగులోనూ జైలర్ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
ఇక్కడ చిరంజీవి భోళా శంకర్ సినిమాతో పాటు రిలీజైన జైలర్…బాక్సాఫీస్ రేసులో విన్నర్ గా నిలిచింది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ పై దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించారు. తమన్నా, రమ్యకృష్ణ, వినాయగన్, సునీల్ కీ రోల్స్ చేశారు. జైలర్ సినిమాకు త్వరలోనే సీక్వెల్ అనౌన్స్ చేస్తారట. రజనీకాంత్ ప్రస్తుతం వేట్టయాన్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు టీజీ జ్ఞానవేల్ రూపొందిస్తున్నారు.