సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా
‘లాల్ సలామ్’. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉండగా…ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయ్యింది. ఫిబ్రవరి 9న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజినీకాంత్ నటిస్తోన్న సినిమా కావటంతో ‘లాల్ సలామ్’పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో ఆయన మెయినుద్దీన్ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. మంచి క్రికెటర్స్, ఫ్రెండ్స్ అయిన హిందూ, ముస్లిం యువకులు వారెంతగానో ప్రేమించే క్రికెట్ ఆటను మతం పేరుతో గొడవలు పడుతూ ఉంటే ఆ గొడవలను మొయిద్దీన్ భాయ్ ఎలా సర్దుబాటు చేశారు. ప్రజల మధ్య ఎలాంటి సఖ్యతను కుదిర్చారనేది ‘లాల్ సలామ్’ సినిమా ప్రధాన కథాంశంగా రూపొందింది. ఈ సినిమాలో జీవితా రాజశేఖర్, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.