హైదరాబాద్ లో మరో డ్రగ్స్ రాకెట్ పట్టుబడింది. హీరో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడటం సంచలనంగా మారింది. 2 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈ డ్రగ్ రాకెట్ లో అమన్ ప్రధాన నిందితుడిగా పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ సరఫరా సమాచారం అందుకున్న ఎస్ వోటీ పోలీసులు వేట సాగించగా..అందులో ఇద్దరు నైజీరియన్లతో పాటు అమన్ పట్టుబడ్డాడు.
డ్రగ్స్ తో ఉండగా వీళ్లు పోలీసుల చేతికి చిక్కారు. రాజకీయ సినీ ప్రముఖులకు ఈ డ్రగ్స్ చేరవేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అమన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు మీడియాలో వైరల్ గా మారాయి. అమన్ గతంలో ఓ సినిమాలో హీరోగా నటించాడు.