కన్నడ డైరెక్టర్ నార్తన్ ఆధ్వర్యంలో పాన్ ఇండియా మూవీ..!
హీరోలుగా రామ్‌చరణ్, సూర్య..!
కన్నడ దర్శకుడు నార్తన్ డైరెక్షన్‌లో హీరో రామ్ చరణ్ చేయబోతున్నాడన్న గుసగుసలకు చెక్‌పడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు నార్తన్ స్వయంగా ఈ విషయాన్ని రివీల్ చేసేశారు. తమిళ నిర్మాత KVN ఈ సినిమా తీయబోతున్నట్టు నార్తన్ వెల్లడించారు. ఇదిలాఉంటే, హీరో రామ్‌చరణ్‌తోపాటు ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఉన్నాడని చెప్పడం అందరినీ షాక్‌కు గురిచేసింది. దీంతో డబుల్ బొనాంజా అంటూ ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
వాస్తవానికి ట్రిపుల్ ఆర్ హిట్ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా అందరికీ సుపరిచితుడైపోయాడు. రామ్‌చరణ్ మూవీకి డైరెక్షన్ చేయాలన్న ఆశ దేశ నలుమూలల నుంచి ఎగసిపడుతోంది. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా…బుచ్చిబాబు దర్వకత్వంలో ఒక సినిమా, అలాగే సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమా చేసేందుకు ఇప్పటికే సైన్ కూడా చేసేశాడు. ఈ క్రమంలోనే కన్నడ డైరెక్టర్ నార్తన్ కథ వినిపించగా, దానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఏడాది క్రితమే వార్తలు గుప్పుమన్నాయి. అయితే అఫీషియల్‌గా ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాకపోవడంతో నిన్నటివరకు ఇవి రూమర్స్‌గానే మిగిలిపోయాయి.
కన్నడ డైరెక్టర్ నార్తన్ విషయానికి వస్తే 2017లో రిలీజైన ‘మఫ్టీ’ చిత్రానికి తానే కథా రచయతగా, డైరెక్టర్‌గా వ్యవహరించాడు. శ్రీమురళి, శివరాజ్‌కుమార్‌లు ‘మఫ్టీ’ చిత్రంలో హీరోలుగా నటించారు.
ఇక 2023లో, తమిళ హీరో శింబు నటించిన ‘పాతు తలా’ చిత్రానికి కథా రచయతగానే కాదు, ఆ మూవీ ఫస్ట్ పార్ట్‌కు డైరెక్షన్ చేసి తన సత్తా చూపించాడు. అయితే పాతు తలా సెకండాఫ్‌ను N.కృష్ణన్ డైరెక్షన్ చేశాడు. అలాగే ఈ ఏడాది నవంబర్ 15న హీరో శివరాజ్‌కుమార్ నటించిన ‘భైరాతి రణగల్’ చిత్రానికి తానే కథా రచయతగా, డైరెక్టర్‌గా చేశాడు. ఇదిలాఉంటే…రామచరణ్, సూర్య కాంబోలో దర్శకుడు నార్తన్ తీసే చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే దానిపై క్లారిటీ లేదు.