కేరళలోని వయనాడ్ లో జరిగిన ప్రకృతి విపత్తు వందలాది మంది ప్రాణాలు తీసింది. ఊరి పక్కనే ఉన్న కొండ చరియలు విరిగిపడి ఇళ్లతో సహా మనుషులు రాళ్ల కింద మృతి చెందారు. ఈ విపత్తు దేశవ్యాప్తంగా పెను విషాధాన్ని నింపింది. వయనాడ్ బాధితుల సహాయార్థం తమ వంతుగా సాయం అందించేందుకు స్టార్స్ కదులుతున్నారు.
చదవండి: దళపతి విజయ్ ‘The GOAT’ నుంచి స్పార్క్ సాంగ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు తమ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రామ్ చరణ్ తను కలిసి కోటి రూపాయల ఆర్థిక సాయం వయనాడ్ బాధితుల సహాయార్థం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేస్తున్నట్లు ప్రకటించారు. వయనాడ్ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు, వారికి ఈ కష్ట సమయంలో ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని మెగాస్టార్ కోరారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు.