రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ గురించి ఓ లేటెస్ట్ అప్డేడ్ తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ పార్ట్ షూటింగ్ నిన్నటితో కంప్లీట్ అయ్యింది. హైదరాబాద్ శివారులో జరిగిన షూటింగ్ తో లాస్ట్ డే వర్క్ కంప్లీట్ చేసుకున్నారు రామ్ చరణ్. ఇక మిగతా ప్యాచ్ వర్క్, కొన్ని సీన్స్ కంప్లీట్ చేయాల్సిఉంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు శంకర్ రూపొందిస్తున్నారు.
షూటింగ్ కంప్లీట్ అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది ఓ క్లారిటీ రానుంది. ఇటీవల దర్శకుడు శంకర్ తన ఇండియన్ 2 ప్రమోషన్స్ లో భాగంగా గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడారు. ఇండియన్ 2 రిలీజైన ఆరు నెలలకు గేమ్ ఛేంజర్ వస్తుందని తెలిపాడు. ఈ ఏడాది చివరకైనా చరణ్ సినిమాను తెరపై చూడాలని మెగాభిమానులు కోరుకుంటున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.