నిఖిల్ హీరోగా మరో పాన్ ఇండియా మూవీ బిగిన్ అయ్యింది. ది ఇండియా హౌస్ పేరుతో ఈ సినిమా రూపొందనుంది. రామ్ చరణ్, యూవీ విక్రమ్ కలిసి వీ మెగా పిక్చర్స్ అనే బ్యానర్ పెట్టారు. ఈ బ్యానర్ తో కలిసి అభిషేక్ అగర్వాల్ ది ఇండియా హౌస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా..అనుపమ్ ఖేర్ మరో కీ రోల్ చేస్తున్నారు.
హంపీలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వీర్ సావర్కర్ జీవితంలో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా ది ఇండియా హౌస్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు కొత్త దర్శకుడు రామ్ వంశీకృష్ణ. ఇవాళ్టి నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. 1905 బ్యాక్ డ్రాప్ లో లవ్, రెవెల్యుషన్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కనుంది.