ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో రికార్డ్ క్రియేట్ చేశారు స్టార్ హీరో రామ్ చరణ్. రీసెంట్ గా ఆయన 20 మిలియన్ ఫాలోవర్స్ కు రీచ్ అయ్యారు. తెలుగు ఇండస్ట్రీ నుంచే కాక సౌత్ హీరోల్లో తక్కువ టైమ్ లో 20 మిలియన్ ఫాలోవర్స్ కు రీచ్ అయిన హీరోగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కొత్త సినిమాల అప్డేట్స్, కెరీర్ విషయాలు కూడా షేర్ చేస్తుంటారు రామ్ చరణ్.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఇంటర్నేషనల్ గా రామ్ చరణ్ కు కొన్ని ప్రెస్టీజియస్ అవార్డ్స్ దక్కాయి. ఆస్కార్ గెల్చిన సినిమాలో హీరో కాబట్టి వరల్డ్ వైడ్ గా ఫిల్మ్ లవర్స్ ఫాలో అవుతుంటారు. పాన్ ఇండియా వైజ్ కూడా గుర్తింపు బాగా పెరగడంతో రామ్ చరణ్ కు సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నారు.