ఆర్ఆర్ఆర్ తర్వాత ఓవర్సీస్ లో తన క్రేజ్ పెంచుకున్నారు రామ్ చరణ్. ఎన్ఆర్ఐలు ఉండే ప్రతి దేశంలో రామ్ చరణ్ సినిమాలను ఇష్టపడే వారున్నారు. ఆస్ట్రేలియాలో తెలుగు వారి సందడి ఎక్కువ. అక్కడ జరిగే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ కు మంచి పేరుంది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో ఈ చిత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 25వ తేదీన వరకు జరిగే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ ఈవెంట్ లో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. గెస్ట్ ఆఫ్ హానర్ అవార్డును గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అందుకోనున్నారు.
ఈ విషయాన్ని ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ (ఐఐఎఫ్ఎం) తన ట్వీట్ లో తెలిపింది. రామ్ చరణ్ గెస్ట్ గా వస్తున్నందుకు మీరంతా ఎగ్జైట్ అవుతున్నార, నాటు నాటు పాటకు స్టెప్స్ వేస్తారా అంటూ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ తన ట్వీట్ లో పేర్కొంది. బాలీవుడ్ నుంచి పలువురు స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రామ్ చరణ్ తన తదుపరి మూవీ ఆర్ సీ 17 కోసం రెడీ అవుతున్నారు.