స్టార్ హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’ సాంగ్, వస్తోన్న అప్డేట్లతో గేమ్ ఛేంజర్‌పై మరింత హైప్ ఏర్పడింది. క్రిస్మస్ సందర్భంగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
ఈ ఏడాది క్రిస్మస్ కి గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం అని చెప్పడమే కాదు, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో పండగ వాతావరణాన్ని తీసుకొస్తున్నారు నిర్మాతలు. తాజాగా గేమ్ ఛేంజర్ డబ్బింగ్ పనులు షురూ అయ్యాయి. పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఆల్ సెట్ ఫర్ ద మెగా ఫైర్ వర్క్స్ – క్రిస్మస్ 2024 అంటూ డబ్బింగ్ ప్రారంభించిన విషయాన్ని పంచుకున్నారు మేకర్స్.