రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను గత సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా రూపొందిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సినిమాకు పురి, ఛార్మీ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారు. డబుల్ ఇస్మార్ట్ కు సంబంధించిన రిలీజ్ డేట్ ను మార్చి 8 అంటూ షూటింగ్ ప్రారంభోత్సవం రోజే ప్రకటించారు డైరెక్టర్ పూరి. అయితే ఆ డేట్ కు సినిమాను రిలీజ్ చేయడం కష్టమేననే విషయం తెలుస్తోంది.
డబుల్ ఇస్మార్ట్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా చాలానే మిగిలిపోవడం ఇందుకు కారణమని అంటున్నారు. దాదాపు నెల రోజులకు సరిపడా భారీ షెడ్యూల్ షూటింగ్ చేయాల్సిఉందట. జనవరి మూడోవారంలోకి అడుగుపెడుతున్న టైమ్ లో మరో నెల రోజుల షూటింగ్ చేసి, దానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయాలంటే మార్చి 8లోపు కుదరదు. అందుకే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.