రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా ఆగష్టు 15న థియేటర్లలో విడుదల కానుంది. డబుల్ ఇస్మార్ట్ మేకర్స్ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌తో టీమప్ అయ్యారు. హనుమాన్ తో బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ నిర్మాతలు డబుల్ ఇస్మార్ట్ ను రిలీజ్ చేయబోతున్నారు.
చదవండి: వాళ్లకు సిల్వర్ కాయిన్ ఇస్తాం- “ఆపరేషన్ రావణ్” డైరెక్టర్ వెంకట సత్య
డబుల్ ఇస్మార్ట్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ ఐదు భాషలు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిరంజన్ రెడ్డి & చైతన్య రెడ్డి సొంతం చేసుకున్నారు. పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని అందించిన డిస్ట్రిబ్యూషన్ హౌస్ చాలా గ్రాండ్ గా ఐదు భాషల్లో డబుల్ ఇస్మార్ట్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.