రామ్ హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ మ్యూజిక్ ప్రమోషన్‌లు స్పీడప్ అయ్యాయి. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ రిలీజ్ కాగా..ఇప్పుడు సెకండ్ సింగిల్-మార్ ముంత చోడ్ చింత అప్‌డేట్ ఇచ్చారు. ఈ పాటను ఎల్లుండి రిలీజ్ చేయబోతున్నారు. దర్శకుడు పూరీ, హీరో రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ పాటలు హిట్టు. డబుల్ ఇస్మార్ట్ ఆల్బమ్ మీద కూడా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
మార్ ముంత చోడ్ చింత అనేది ఇస్మార్ట్ శంకర్ పాపులర్ డైలాగ్ ఆ లైన్ తోనే ఈ పాట రూపొందించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా కనిపించనుంది.