స్టార్ హీరోయిన్ రశ్మిక డీప్ ఫేక్ క్రియేట్ చేసిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ఈ విషయంపై ఎమోషనల్ గా ట్వీట్ చేసింది రశ్మిక. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఈమని నవీన్ అనే వ్యక్తి రశ్మిక డీప్ ఫేక్ క్రియేట్ చేసి ఉండొచ్చనే అనుమానంతో ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతనే ఇవి తయారు చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ఈ విషయంపై రశ్మిక ట్వీట్ లో ఢిల్లీ పోలీసులకు థ్యాంక్స్ చెప్పింది. తనకు అండగా నిలబడేవారు ఉన్నందుకు హ్యాపీగా ఉందని తెలిపింది. తప్పులు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని ఈ చర్య ద్వారా పోలీసులు చెప్పారని రశ్మిక పేర్కొంది. యువతీ యువకులు తమ ఫొటోస్ ను ఎవరైనా తప్పుగా ఉపయోగిస్తే నేరమని తెలుసుకోవాలి. అని పోస్ట్ చేసింది. జరా పటేల్ అనే మోడల్ ను రశ్మిక ముఖంతో మార్ఫింగ్ చేసి డీప్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేశారు. ఇవి అప్పట్లో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.