రశ్మిక మందన్న తన కెరీర్ లో చేస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ కుబేర. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నాగార్జున, ధనుష్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఈ రోజు రశ్మిక క్యారెక్టర్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో రశ్మిక ఒక అడవిలో పాతిపెట్టిన డబ్బున్న సూట్ కేసును తవ్వి తీసుకుని, ఆ సూట్ కేసులో డబ్బు అలాగే ఉన్నందుకు హ్యాపీగా ఫీలవుతూ వెల్తోంది.
ఆమె అంత డబ్బు ఎందుకు సూట్ కేసులో దాచింది, ఆ సూట్ కేసును ఎందుకు అడవిలో పాతిపెట్టింది అనే ప్రశ్నలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో ట్యాక్స్ ఎగవేతలు, ఐటీ రైడ్స్ వంటి అంశాలతో శేఖర్ కమ్ముల కుబేరను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడిగా కనిపించడం విశేషం. ఈ ఏడాది డిసెంబర్ లో కుబేరను రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.