యానిమల్ సక్సెస్ తర్వాత హీరోయిన్ రశ్మిక మందన్న రెమ్యునరేషన్ పెంచిందంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ పోస్టులు కనిపిస్తున్నాయి. ఇలాంటి ఒక పోస్ట్ పై స్పందించింది రశ్మిక. తన రెమ్యునరేషన్ పై క్లారిటీ ఇచ్చింది. రశ్మిక ఇచ్చిన ఈ ఆన్సర్ ఫన్నీగా ఉండి నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది.
రశ్మిక ప్రస్తుతం 4 నుంచి 4.5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటోందని, ఈ ఫీజును ప్రస్తుతం మరింత పెంచిందనే పోస్టును రశ్మిక స్పందిస్తూ – నేను ఈ పోస్ట్ ను మా ప్రొడ్యూసర్స్ కు చూపిస్తా. ఇలా మీడియా వాళ్లు నా రెమ్యునరేషన్ పెంచానంటూ రాస్తున్నారు. నేను వాళ్లు చెప్పినంత మీ దగ్గర తీసుకుంటే బాగుంటుంది కదా అని అడగాలి కదా అంటా. అని రీట్వీట్ చేసింది. ప్రస్తుతం రశ్మిక పుష్ప 2 సినిమాలో నటిస్తోంది.