స్టార్ డమ్ లోనే కాదు మంచి మనసులోనూ రశ్మిక మందన్న టాప్ లో ఉంటుంది. తన దృష్టికి వచ్చిన సోషల్ ఇష్యూస్ పై స్పందిస్తుంటుందీ నాయిక. ఇటీవల కేరళ వయనాడ్ లో జరిగిన కొండచరియల విరిగిపడిన విషాధం పట్ల రశ్మిక దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. రశ్మిక వయనాడ్ బాధితులను ఆదుకునే క్రమంలో తన వంతు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
చదవండి: “బడ్డీ” రిజల్ట్ తో హ్యాపీగా ఉన్నాం – డైరెక్టర్ శామ్ ఆంటోన్
ఈ విషాధం పట్ల రశ్మిక మందన్న తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని ఆమె పేర్కొంది. రశ్మిక మందన్న ప్రస్తుతం పుష్ప 2 ది రూల్, సికిందర్, ది గర్ల్ ఫ్రెండ్ తదితర చిత్రాల్లో నటిస్తోంది.