పుష్ప 2 (Pushpa 2) సినిమా బాలీవుడ్ (Bollywood) లో వంద కోట్ల రూపాయల వసూళు చేసినప్పుడే రశ్మిక (Heroine Rashmika mandanna) క్రేజ్ నార్త్ మొదలైంది. ఆమెను శ్రీవల్లి (Srivalli)గా అక్కడి ప్రేక్షకులు లవ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలతో హిందీలో తన కెరీర్ కంటిన్యూ చేసింది రశ్మిక. యానిమల్ (Animal) బ్లాక్ బస్టర్ తో నార్త్ లో తన క్రేజ్ పెంచుకుంది. రీసెంట్ గా ఆమెకు బాలీవుడ్ లో సికిందర్ (Sikindar) పేరుతో మరో బిగ్ ప్రాజెక్ట్ దక్కింది. సల్మాన్ ఖాన్ (Salman khan) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికవడం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉందని రశ్మిక పేర్కొంది.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం (Director AR murugadoss) వహిస్తున్న సికిందర్ మూవీ షూటింగ్ ఈరోజు నుంచి మొదలైంది. దర్శకుడు మురుగదాస్, హీరో సల్మాన్ సెట్ లో ఉన్న ఫొటోను షేర్ చేశారు. సికిందర్ సినిమాను సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. వచ్చే ఈద్ పండక్కి ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో సల్మాన్, రశ్మిక జోడి ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వనుంది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న రశ్మిక…పుష్ప 2 రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.