డీప్ ఫేక్ విషయంలో తాను మొదట్లో మాట్లాడకూడదని అనుకున్నానని…అయితే తనలాగే మరికొందరికి ఇలా జరగకూడదనే స్పందించినట్లు తెలిపింది హీరోయిన్ రశ్మిక మందన్న. రశ్మిక డీప్ ఫేక్ విషయం దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమల్లో సంచలనమైంది. అమితాబ్ లాంటి వాళ్లు రెస్పాండ్ అయ్యారు. ఢిల్లీ పోలీసులు ఈ కేసును టేకప్ చేసి…ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. ఇలాంటివి భవిష్యత్ లోనూ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
డీప్ ఫేక్ విషయంపై రశ్మిక మాట్లాడింది. కాలేజ్ రోజుల్లో తనకు ఇలాంటివి జరిగితే ఎవరూ సపోర్ట్ చేసేవారు కారని అంది. ఇప్పుడు తానో సెలబ్రిటీ కాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చి, విస్తృతంగా ప్రచారమైందని చెప్పింది. మొదట్లో దీని గురించి తాను మాట్లాడకూడదని అనుకున్నానని, అయితే ఓ సామాన్య మహిళలకు ఇలా జరగకూడదనే స్పందించినట్లు చెప్పింది. రీసెంట్ గా యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రశ్మిక..ఇప్పుడు పుష్ప 2 సినిమాలో నటిస్తోంది.