బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ రైడ్ 2 సినిమా ఓపెనింగ్ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు. స్పెషల్ ఫ్లైట్ లో ముంబై వెళ్లిన వీళ్లు..అక్కడి కార్యక్రమంలో పాల్గొని రైడ్ 2 టీమ్ కు బెస్ట్ విశెస్ చెప్పారు. రవితేజ అజయ్ దేవగణ్ పక్కన క్లాప్ పట్టుకుని ఫొటోస్ కు ఫోజులిచ్చారు.
అజయ్ దేవగణ్ నటించిన హిట్ సినిమా రైడ్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు రవితేజ. ఈ సినిమాకు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ పెట్టారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో దర్శకుడు హరీశ్ శంకర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారత్ లో జరిగిన అతి పెద్ద ఐటీ రైడ్ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్ గా రవితేజ కనిపించబోతున్నారు.