రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. డైరెక్టర్ హరీశ్ శంకర్ ఈ అప్డేట్ గురించే సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఈ రోజు అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తోంది.
అజయ్ దేవగణ్ హీరోగా నటించిన బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ది రైడ్ రీమేక్ గా మిస్టర్ బచ్చన్ సినిమా రూపొందిస్తున్నారు దర్శకుడు హరీశ్ శంకర్. ఈ మూవీ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చివరి దశకు వచ్చాయి. దీంతో ఆగస్టు 15న సినిమాను రిలీజ్ చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తోంది.