రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. టీజర్ లో రవితేజ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అవుతున్నాయి. మనదేశానికి అసలు సమస్య నల్లధనం అంటూ బ్లాక్ మనీ నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు హరీశ్ శంకర్. ఈ సినిమాకు హిందీ హిట్ మూవీ ది రైడ్ ఆధారం. ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా రవితేజ కనిపించనున్నారు.
చదవండి: ధనుష్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన కుబేర టీమ్
మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తోంది. దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందిస్తున్నారు. టీజర్ లో సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇంటికొచ్చే చుట్టాల్లాంటివి వస్తుంటాయి పోతుంటాయి. ఆటిట్యూడ్ ఇంటి పేరులాంటిది అది పోయేదాకా మనతోనే ఉంటుంది అనే డైలాగ్ ఇంప్రెస్ చేసింది.