రవితేజకు సంక్రాంతి మిస్ అయినట్టే

Spread the love

మాస్ మహారాజా రవితేజ ఈ ఇయర్ సంక్రాంతికి ఈగల్ మూవీ రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. పోటీ ఎక్కువుగా ఉండడం వలన తప్పుకున్నారు. ఈసారి ముందుగానే సంక్రాంతి రావాలని ఫిక్స్ అయ్యారు. తను నటిస్తోన్న 75వ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఈ మూవీ షూట్ లో రవితేజకు గాయం అవ్వడంతో ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. మరి.. సంక్రాంతికి ఈ మూవీ వస్తుందా..? లేక పోటీ నుంచి తప్పుకుంటుందా..?

ఈగల్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. భారీ సినిమాలు పోటీలో ఉండడం వలన నిర్మాత శ్రేయస్సు కోసమని తను పోటీ నుంచి తప్పుకుంది. ఫిబ్రవరిలో ఈగల్ థియేటర్స్ లోకి వచ్చింది కానీ.. మెప్పించలేకపోయింది. అదే సంక్రాంతికి వచ్చుంటే.. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వచ్చేవి కానీ.. అలా జరగలేదు. ఈసారి మాత్రం అంతా పక్కాగా ప్లాన్ చేసుకుని సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యారు. పైగా కెరీర్ లో మైలురాయిలా నిలిచే 75వ చిత్రం. ఈ మూవీని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే.. ఈ మూవీ షూటింగ్ లో రవితేజ కుడి చేతి కండరాలకు గాయం అయ్యింది. దీనిని ముందు పట్టించుకోలేదు. అలాగే షూటింగ్ లో పాల్గొన్నారు. ఆతర్వాత నొప్పి పెరగడంతో హస్పటల్ లో చేరడం.. వైద్యులు సర్జరీ చేయడం జరిగింది. ఈ రోజు రవితేజ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

చదవండి: అభయ కేసులో ట్విస్ట్‌..? సంజయ్ నిర్దోషన్న తల్లి..!

అయితే రవితేజ ఆరు వారాలు పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి రవితేజ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే.. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆరు వారాలు రవితేజ రెస్ట్ తీసుకోవాలి అంటే.. షూటింగ్ బ్రేక్ పడినట్టే. మేకర్స్ మాత్రం రవితేజ లేని సీన్స్ చిత్రీకరించాలి అనుకుంటున్నారట. ఆరు వారాల తర్వాత రవితేజ షూటింగ్ లో జాయిన్ అవుతారు కాబట్టి ఎలాగైనా సరే.. సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట కానీ.. సాధ్యమౌతుందో లేదో చూడాలి. ఏది ఏమైనా రవితేజకు సంక్రాంతి కలిసి రావడం లేదోమో అనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఇయర్ లో సంక్రాంతికి ఈగల్ రావాలి అనుకుంటే కుదరలేదు.. నెక్ట్స్ ఇయర్ ఈ మూవీని రిలీజ్ చేయాలి అనుకుంటే ఇలా జరిగింది.

Hot this week

‘గేమ్ ఛేంజర్‌’రివ్యూ

కొన్ని గంటల క్రితం రిలీజైన ‘గేమ్ ఛేంజర్‌’ నన్ను ఆలోచనలో పడేసింది....

డాకు మహారాజ్’ లో కొత్త బాలకృష్ణ ని చూస్తారు : బాబీ

డాకు మహారాజ్' సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు...

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్ -వెంకటేష్

'సంక్రాంతికి వస్తున్నాం' క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్. ఎంటర్ టైన్మెంట్ వెరీ ఫ్రెష్...

నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల వసూల్లు

వసూళ్లలో ఇండియన్‌ నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల...

గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది : అంజలి

*‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది :...

Topics

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం: పవన్ కళ్యాణ్

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం.. కొత్త...

‘మార్కో’ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ : ఉన్ని ముకుందన్

మార్కో' సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ....

‘తండేల్’ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

అల్లు అరవింద్ ప్రెజెంట్స్, నాగ చైతన్య, సాయి పల్లవి, దేవి శ్రీ...