హీరో రవితేజకు ఎనర్జిటిక్ ఎంటర్ టైనర్స్ మంచి సక్సెస్ ఇచ్చాయి. అలాంటి సినిమాలే రవితేజకు స్ట్రెంత్. ఆ ఫేవరేట్ జానర్ వదిలి ఇటీవల సీరియస్ మూవీస్ చేస్తున్నాడు. దాంతో వరుసగా ఫ్లాప్స్ పడుతున్నాయి. ఇప్పుడు ఆలోచనలో పడిన రవితేజ..జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీతో ఓ కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ చేయబోతున్నాడు.
సీరియస్ మూవీస్ మధ్య ఇలాంటి ఒక ఎంటర్ టైనర్ చేస్తే ఫ్రెష్ గా ఉంటుందని రవితేజ భావిస్తున్నాడు. ఈ సినిమా రవితేజ పుట్టినరోజైన ఈ నెల 26న అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. రవితేజ అనుదీప్ కేవీ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించనుంది. కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం రవితేజ నటించిన ఈగిల్ సినిమా వచ్చే నెల 9న రిలీజ్ కు రెడీ అవుతోంది.