స్పీడ్ గా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోవడం లో హీరో రవితేజను మించిన హీరో లేడు. ఈ ఫేమ్ ఉన్నంతకాలం వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని రవితేజకు తెలుసు. అందుకే స్క్రిప్ట్ కాస్త నచ్చినా, డైరెక్టర్ ఓ మోస్తరు టాలెంటెడ్ అయినా, కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ బాగున్నా సినిమా చేసేస్తాడు. అలా మూడు నాలుగు సినిమాలు ఎప్పుడూ ఈ హీరో చేతిలో ఉంటుంటాయి. వాటిలో మూడు పోయినా ఒకటి హిట్ అయినా మళ్లీ రవితేజ నిర్మాతలతో తన ఆట మొదలుపెడతాడు.
ఈ క్రమంలో జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తోనూ ఓ సినిమా కమిట్ అయ్యాడు. అయితే కథ నచ్చక ఈ సినిమా రవితేజ వదిలేసినట్లు తెలుస్తోంది. అనుదీప్ మరీ డెలికేట్ డైరెక్టర్. అతని కామెడీ అన్నిసార్లూ వర్కవుట్ కాదు. ప్రిన్స్ సినిమానే ఎగ్జాంపుల్. ఆ జోక్స్ పెద్ద హీరోలకు సెట్ కావు. రవితేజ ఈ ప్రమాదాన్ని ఆలస్యమైనా పసిగట్టేశాడు.