ఉప్పెన దర్శకుడు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఇవాళ అఫీషియల్ గా వెల్లడించారు మేకర్స్. ఇవాళ ఏఆర్ రెహమాన్ బర్త్ డే సందర్భంగా ఆయనకు ఆర్సీ 16 టీమ్ లోకి స్వాగతం పలుకుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో రామ్ చరణ్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ను సెలెక్ట్ చేశారు. ఆర్సీ 16 సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.