రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్ సీ 16 సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. దుబాయ్ లోని ఫిర్దౌస్ స్టూడియోలో ఈ కార్యక్రమాల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు సాన, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఫొటో తీసుకుని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ చూపించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఆర్ సీ 16 తెలుగు నుంచి రాబోతున్న మరో భారీ పాన్ ఇండియా మూవీ కానుంది.