పుష్ప ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ లో కన్నా బాలీవుడ్ లో విజయం సాధించడం విశేషం. దీంతో పుష్ప సీక్వెల్ పుష్ప 2 కు భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే.. పుష్ప 2 మాత్రమే కాదు.. పుష్ప 3 కూడా ఉందని ప్రచారం జరుగుతుంది. మరి.. నిజంగానే పుష్ప 3 ఉందా..? లేక ఇది గ్యాసిప్పా..? అసలు నిజం ఏంటి..? ఇంతకీ విషయం ఏంటంటే.. పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ కావాల్సింది కానీ.. అనుకున్న ప్రకారం షూటింగ్ జరగకపోవడం వలన డిసెంబర్ 6కు వాయిదాపడింది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నెలాఖరుకు కంప్లీట్ చేయాలి అనుకున్నారు కానీ.. అక్టోబర్ నెలాఖరుకు పూర్తవుతుందని తెలిసింది. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా అంతకు మించి ఉందనేలా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నారు సుకుమార్. ఇంకా ఐటం సాంగ్స్ బ్యాలెన్స్ ఉంది. అది ఎవరితో చేయనున్నారు అనేది త్వరలో క్లారిటీ వస్తుంది. డిసెంబర్ 6న పుష్ప 2 రావడం మాత్రం పక్కా అని అనౌన్స్ చేశారు.
పుష్ప 2 కు సీక్వెల్ గా పుష్ప 3 కూడా ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. పుష్ప రిలీజైన తర్వాత పుష్ప 2 మాత్రమే కాదు.. పుష్ప 3 కూడా ఉందని ఫాహిద్ ఫాజిల్ ఓ ఇంటర్ వ్యూలో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి పుష్ప 3 గురించి వార్తలు వస్తున్నాయి కానీ.. నిజంగా ఉందా..? లేక ఇది గ్యాసిప్పా..? అనేది క్లారిటీ లేదు. అయితే.. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఇటీవలే సుకుమార్.. పుష్ప 3 కథను బన్నీకి చెప్పాడట. ఈ కథ నచ్చడంతో బన్నీ ఓకే చెప్పాడని తెలిసింది. పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్ప 3 కు సంబంధించిన లీడ్ ఇస్తారని సమాచారం. ఈ మూవీ ఎప్పుడు ఉంటుందంటే.. బన్నీ త్రివిక్రమ్ తో సినిమా, ఆతర్వాత అట్లీ లేదా సందీప్ రెడ్డితో సినిమా చేసిన తర్వాత ఉండచ్చని టాక్ వినిపిస్తోంది.