పవన్ కళ్యాణ్ & అల్లు అర్జున్ మధ్య గ్యాప్ కు కారణం అదేనా !!

Spread the love

‘అల్లు’కు పోతే సరిపోయే కదా..!
బన్నీకి పొగరంటూ నెట్టింట ఆగ్రహం..?

అల్లు వర్సెస్ కొణిదల కింద నడుస్తోంది ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వర్గపోరు. వాస్తవానికి చిరంజీవి, అల్లు అరవింద్ బావ, బావమరుదులు అయినా…ఎన్నికల వేళ ఇరు కుటుంబాల్లో రేగిన రచ్చ అంతా ఇంతా కాదు. తన భార్య స్నేహలతారెడ్డికి అత్యంత ఆప్తుడని భర్తగా అల్లు అర్జున్‌… నంద్యాల వైఎస్‌ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశాడని కొందరు అంటుంటే…లేదు,లేదు పవన్‌ కల్యాణ్‌ అంటే ఇష్టపడని అల్లు అర్జున్‌… మెగావారి ప్రత్యర్థి పార్టీ వైసీపీకి మద్దతు పలికి కయ్యానికి కాలుదువ్వాడంటూ మరికొందరు అంటున్నారు. అందుకే కదా, పవన్‌కు మద్దతుగా కనీసం పిఠాపురం కూడా వెళ్లలేదని వారు గుర్తుచేస్తున్నారు. మెగాస్టార్‌ నీడలో ఎదిగి… ఈరోజు ఆ ఇంటినుంచి వచ్చిన ఎంతోమంది హీరోలు తమతమ స్థాయిలో పిఠాపురం వెళ్లి పవన్‌కు ప్రచారం చేసినా, అల్లు అర్జున్ మాత్రం వెళ్లకపోవడాన్ని నాటి నుంచి ఖండిస్తూనే ఉన్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే…చెల్లెలు సురేఖతో కలిసి అల్లు అరవింద్‌ పిఠాపురంలో ఉన్న పవన్‌ను కలుసుకోగా…అదేరోజు నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి రవిచంద్రకు మద్దతు పలకడం చూస్తుంటే…

చదవండి: భర్త మర్మంగాన్ని కోసి పరారైన భార్య..?

ఇది అల్లు వారింట ఏర్పడిన పకడ్బందీ వ్యూహమే అంటూ చాలామంది గుసగుసలాడుకుంటున్నారు. నాటి ఏర్పడిన రచ్చ అంతటితో ఆగలేదు…నేడు మాటల తూటాలు పేల్చుకునే స్థాయికి వెళ్లిపోయింది. కాకుంటే నేరుగా ఎవరికివారు విమర్శించుకోకుండా, పరోక్షంగా ఒకరిపై ఒకరు నర్మగర్భ వ్యాఖ్యలు చేసుకోవడం…అల్లు వర్సెస్ మెగా ఫైట్‌గా అందరినోళ్లల్లో నానుతోంది. చివరికి ఎంతదాకా వెళ్లిందండే వీరి గొడవ…ఎక్కడో కర్ణాటక పర్యటనలో ఉన్న పవన్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌పై, అందునా నేడు ఇండస్ట్రీలో హీరోలు ఎంచుకునే పాత్రలపై ఆయన మండిపడటాన్ని బన్నీ ఫ్యాన్స్‌ ఒకింత అభ్యంతరం వ్యక్తంచేయగా…తనదికాని ఫంక్షన్‌కు ప్రత్యేక అతిథిగా హాజరైన బన్నీ… నాకు నచ్చితే వెళ్తా…ఈ కార్యక్రమానికి నాకు నచ్చే వచ్చానంటూ పరోక్షంగా నంద్యాల ఎన్నికల టూర్‌పై కామెంట్స్‌ చేయడం మరింత అగ్గిరాజేసింది. ఈ క్రమంలో ఏమీలేని దానికి గొడవ పెట్టుకునేలా అల్లు అర్జున్ సీన్ క్రియేట్ చేస్తున్నారని క్రిటిక్స్ సైతం విశ్లేషిస్తున్నారు.

ఇండస్ట్రీకి పరిచయమైన తొలినాళ్లలో చిరంజీవి గారిని చూసే హీరోని అయ్యానని పొగిడిన ఈ హీరో…నా ఫ్యాన్స్‌ వల్లే నేను హీరో అయ్యానంటూ చెప్పడం చూస్తుంటే ఆయనకు పొగరు పీక్స్‌లో ఉందని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్‌. ఇదిలాఉంటే అలగాజనంలా ఇరుకుటుంబాలు రోడ్డెక్కిన వేళ…నందమూరి ఫ్యామిలీని చూసి వారు నేర్చుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు. చంద్రబాబు పుణ్యామాని బాబయ్‌, అబ్బాయ్‌ల మధ్య ఉన్న దూరం గురించి ఎవరికి తెలియంది కాదు?…రాజకీయంగానూ, పార్టీ పరంగానూ వారి మధ్య వైరుధ్యం ఏ పాటిదో తెలుసుకదా…అయినా వారంతా కిక్కురుమనకుండా ఎవరికి వారు ఇండస్ట్రీలో పనిచేసుకుంటూ ఉంటే…మెగా, అల్లు ఫ్యామీలు మాత్రం రోడ్డెక్కి రచ్చచేసుకోవడాన్ని చిల్లర వ్యవహారంగా చూస్తున్నారు.

‘మెగా’ రచ్చవేళ ‘నందమూరి’ భళా..?

అవును నిజం…మెగా, అల్లు ఫ్యామీల మధ్య రచ్చ చూస్తున్నవారంతా, ఎన్నో ఏళ్లుగా కుటుంబంలో విభేదాలు ఉన్నా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్‌ ఎక్కడా ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ కనిపించరని, ఫంక్షన్ ఏదైనా కలిసిమెలిసి హుందాగా వ్యవహరిస్తారని…బాబయ్‌, అబ్బాయిలకు పక్క పార్టీ వాళ్లతో స్నేహమున్నా కూడా వారితో సన్నిహితంగా వ్యవహరించడం కానీ, తద్వార పార్టీలో, కుటుంబంలో కలహాలు తీసుకుచ్చే ప్రయత్నం ఏనాడూ చేయలేదని…బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ను ఉద్దేశిస్తూ సర్వత్రా మెచ్చుకుంటున్నారు. ఏం..? లక్ష్మీ పార్వతీ ఉండగా అన్నగారి ఇంట్లో మొదలైన కలహాలు…ఆయన మరణాంతరం చెలరేగిన గొడవలు ఏవీ కూడా ఆ ఇంటి నాలుగు గోడలు దాటి బయటకు రాలేదని గుర్తుచేస్తున్నారు. అన్న ఎన్టీఆర్ పరమపదించాక చంద్రబాబుకు వ్యతిరేకంగా పార్టీ పెట్టిన హరికృష్ణ హుందాగానే వ్యవహరించారు.

చదవండి: తెలంగాణ పార్టీపైనే ఇప్పుడు బాబు ఫోకస్‌..?

ఆ తర్వాత 2009 ఎన్నికల్లో జూ.ఎన్టీఆర్‌ను కుటుంబసభ్యుడిగా చేరదీసి ఆయనచే ప్రచారం చేయించుకున్న చంద్రబాబు ఓటమి అనంతరం వదిలివేయడంపై…హరికృష్ణ తనయులుగా జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు ఇద్దరూ కూడా చంద్రబాబు, బాలకృష్ణకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతెందుకు..? మొన్న ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నా కూడా ఈ ఇద్దరూ నోరుమెదపకపోవడంపై సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్లే తిట్టుకున్న పరిస్థితి. అది అంతవరకే…కానీ చంద్రబాబు సీఎం అయితే సాక్షాత్తూ జూ.ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపి తన హుందాతనాన్ని కాపాడుకున్నాడు. ఇప్పటికిప్పుడు వారిమధ్య ఎన్ని అంతరాలున్నా ఒకే వేదికను ఆనందంగా పంచుకుని, మంచిగా కార్యక్రమానికి ముగింపుపలికే సంస్కృతి నందమూరి వారి సొంతమంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరి పవన్ & అల్లు అర్జున్ ల అలకలకు తొందరలోనే తెర పడుతుందని అనుకుంటున్నారు..ఇరు ఫ్యాన్స్…

Hot this week

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

Topics

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...

పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...

మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్ లాంచ్

'రాజాసాబ్ ' డైరెక్ట‌ర్ మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్...