రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీకి “రాజా సాబ్” అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ను ఇవాళ అనౌన్స్ చేశారు. మోస్ట్ అవేటెడ్ మూవీగా రెబల్ ఫ్యాన్స్, ఫిల్మ్ లవర్స్ “రాజా సాబ్” కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో “రాజా సాబ్” సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది.
“రాజా సాబ్” ఫస్ట్ లుక్ పోస్టర్ కలర్ ఫుల్ గా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో వింటేజ్ లుక్ లో, లుంగీ కట్టుకున్న ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు. సరదాగా, రొమాంటిక్ గా సాగే క్యారెక్టర్ లుక్ లో ప్రభాస్ ను చూడటం అభిమానులతో పాటు ఫిల్మ్ లవర్స్ అందరికీ ఫ్రెష్ ఫీల్ కలిగిస్తోంది. “రాజా సాబ్” ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే ఒక కలర్ ఫుల్ సినిమా చూడబోతున్నామనే ఇంప్రెషన్ కలిగించారు దర్శకుడు మారుతి. ఆయన గతంలో “భలే భలే మగాడివోయ్”, “మహానుభావుడు”, “ప్రతి రోజు పండగే” వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను కొత్తగా సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చూపిస్తాడనే నమ్మకం అందరిలో ఏర్పడుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో, డైరెక్టర్ మారుతి అలా “రాజా సాబ్” మూవీని డిజైన్ చేసి పిక్చరైజ్ చేస్తున్నారు. ధమాకా, కార్తికేయ 2 వంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో దూసుకెళ్తున్న ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “రాజా సాబ్” సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది. “రాజా సాబ్” సినిమా తమ సంస్థలో ఒక మెమొరబుల్ మూవీగా మిగిలిపోయేలా నిర్మిస్తోంది.
“రాజా సాబ్” పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు ఇండియన్ టాప్ మూవీ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. మగధీర, బాహుబలి సినిమాలకు పనిచేసిన కమల్ కన్నన్ వీఎఫ్ఎక్స్ అందిస్తున్నారు. కార్తీక్ పలని సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం “రాజా సాబ్” సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది.