డైరెక్టర్ తరుణ్ భాస్కర్ థియేటర్స్ లో సక్సెస్ కాకున్నా…ఓటీటీలో విజయాన్ని దక్కించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన కీడా కోలా సినిమా గతేడాది థియేటర్స్ రిలీజైంది. అక్కడ పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. కీడా కోలా 100 ఫ్లస్ మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ దక్కించుకుంది.
క్రైమ్ కామెడీ గా తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య రావ్, రవీంద్ర విజయ్, రఘురామ్, బ్రహ్మనందం, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. హీరో రానా సమర్పణలో ఈ సినిమా నిర్మాణమైంది. పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ గెల్చుకున్న తరుణ్ భాస్కర్..ఆ తర్వాత ఆ స్థాయి సక్సెస్ ఫుల్ సినిమాలు చేయలేకపోయాడు. కీడా కోలా సక్సెస్ అతనికి ఎంతో కొంత ఉత్సాహాన్ని ఇచ్చేదే అనుకోవచ్చు.