Movie Name : Bharateeyudu 2
Release Date : July 12, 2024
friday poster reating – 2.5
Starring : Kamal Haasan, Siddharth, Rakul Preet Singh, SJ Suryah, Bobby Simha, Vivek, Priya Bhavani Shankar, Gulshan Grover
Directors : S. Shankar
Producers : Subaskaran Allirajah, Udhayanidhi Stalin
Music Directors: Anirudh Ravichander
Cinematographer: Ravi Varman
కథ
పార్ట్ 2 ద్వారా ప్రేక్షకులను మరోసారి కలుసుకున్నాడు భారతీయుడు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ తిరిగొచ్చిన భారతీయుడు పట్ల అశేష సినీఅభిమాన లోకం ఎంతగానో ఎదురుచూసింది. అయితే ప్రేక్షకులకు తగ్గట్టుగా ఈసారి కూడా అంతేవిధంగా చిత్రం అలరించిందా అంటే ఎక్కడో మనసుకి కనక్ట్ కాలేదు అనిపిస్తోంది. 1996 మే 6న విడుదలైన భారతీయుడు అంటే ప్రజలందరిలోనూ ఒక ఎమోషన్…దేశం గర్వించదగ్గ చిత్రంగా నిలిచిన భారతీయుడు పేరు చెబితే ఇప్పటికీ నలుగురైదుగురు మధ్య చర్చ ఆగమన్నా ఆగదు. ఎందుకంటే భారతీయుడు క్యారెక్టర్లో కమల్ హాసన్ ఒదిగిపోయిన తీరు ఓ అద్భుతం.. అలాంటి అద్భుతాన్ని డైరెక్టర్ శంకర్ మళ్లీ తీసుకొస్తున్నాడు అనగానే దేశం మొత్తం చూసేందుకు ఎంతగానో ఉవ్విళ్లూరింది. అయితే ఈసారి పార్ట్ 2 ద్వారా వచ్చిన భారతీయుడు కొంచెం నిరాశపరిచడానే చెప్పాలి. క్యారెక్టర్ పరంగా కమల్హాసన్ ఏ విధంగా నటించి మెప్పిస్తాడో మనం వేరే చెప్పక్కర్లేదు. అయితే భారతీయుడు మేకప్ విషయంలో కేర్ తీసుకోలేదేమో అనిపించింది. ఏదో నలుగురు ఫ్రైండ్స్…వారంతా సోషల్ మీడియాలో ఓ ఛానల్ నడుపుతూ సొసైటీలో అవినీతి, అరాచకాలను ఆపాలన్న తపన. దానికి టీమ్ లీడ్గా సిద్ధార్థ్. ఈ అధికారుల అవినీతి భరతం పట్టాలంటే మళ్లీ భారతీయుడే రావాలంటూ హ్యాష్ట్యాగ్తో దేశవ్యాప్తంగా యూత్ను సోషల్ మీడియా ద్వారా ఏకం చేయడం….తైపీలో ఉన్న భారతీయుడు ఇది తెలుసుకోవడం…మారువేషంలో దేశానికి వచ్చిన అతను ఈ అవినితిని రూపుమాపడం యువత వల్లే సాధ్యమని చెైతన్యపరచడం….తద్వారా యువత కుటుంబాల్లో చోటుచేసుకున్న పరిణామాలు…మరోవైపు భారతీయుడుని పట్టుకునేందుకు సీబీఐ అధికారుల స్టంట్స్…ఇలా చివరి వరకు కథనం సాగిపోతుంది. హీరోయిన్ విషయానికి వస్తే సిద్ధార్థ సరసన రకుల్ప్రీత్ సింగ్ ఉన్నాకూడా…ఆమె ఎప్పుడో ఎక్కడో తళుక్కుమనడం కొసమెరుపు. అంతేకాదు, చిత్రం చివరిలో భారతీయుడు-౩ వచ్చేఏడాదే వస్తుందని చెప్పడం…ఆ ప్రోమో కట్లో కమల్హాసన్, కాజల్ అగర్వాల్ కత్తులు దూసుకుంటూ కనిపించడం మరో విశేషం. ఏదేమైనా ప్రధానంగా కథ, కథనం బలహీనతలు కాగా…కమల్ హాసన్ నటన, సిద్ధార్థ్ రోల్ చిత్రానికి బలం. నాటి భారతీయుడులో ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఉర్రూతలూగించగా…నేటి భారతీయుడులో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిందనే చెప్పాలి.
సాంగేతిక నిపుణులు – అనిరుధ్ తన మ్యాజిక్తో అలరించాడు..బ్యాగ్గ్రౌండ్ స్కోర్ తో మంచి మార్కులే వేసుకున్నాడు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీలో అన్నీ ప్రేమ్స్ చాలా రిచ్గా కనిపించాయి.. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తన వరకూ తను న్యాయం చేసారు.
ప్లస్ పాయింట్స్
————–
కమల్ హాసన్
సిద్ధార్థ్
లావిష్ విజువల్స్
మైనస్ పాయింట్స్
—————
బోరుకొట్ట్టించే కథనం
సంగీతం
లోపించిన విలనిజం
ట్యాగ్ లైన్ – ‘సాగ’తీయుడు
రేటింగ్ – 2.5
నోట్ – ఇది రివ్యూ రైటర్ అభిప్రాయం మాత్రమే..