రివ్యూ – గుంటూరు కారం

Spread the love

నటీనటులు – మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు

టెక్నికల్ టీమ్ – ఎడిటర్ – నవీన్ నూలి, , సినిమాటోగ్రఫీ – మనోజ్ పరమహంస, ప్రొడక్షన్ డిజైన్ – ఎ.ఎస్. ప్రకాష్, మ్యూజిక్ – తమన్, నిర్మాత – సూర్యదేవర రాధాకృష్ణ, రచన దర్శకత్వం – త్రివిక్రమ్

హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని హారికా హాసినీ క్రియేషన్స్ నిర్మించింది. సంక్రాంతి క్రేజీ మూవీగా థియేటర్స్ లోకి వచ్చిన గుంటూరు కారం సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథేంటంటే

వైరా వసుంధర (రమ్యకృష్ణ), రాయల్ సత్యం (జయరాం) కొడుకు వీర వెంకట రమణ (మహేశ్ బాబు). తల్లిదండ్రులు చిన్నప్పుడే డివోర్స్ తీసుకోవడం వల్ల మేనత్త దగ్గర పెరుగుతుంటాడు రమణ. వసుంధర రెండో పెళ్లి చేసుకుని రాజకీయాల్లో రాణించి మంత్రి అవుతుంది. వసుంధర చుట్టూ రాజకీయాన్ని ఆమె తండ్రి వైరా వెంకటస్వామి (ప్రకాష్ రాజ్) నడుపుతుంటాడు. వసుంధర రాజకీయ, వ్యక్తిగత జీవితానికి మొదటి కొడుకు రమణ ఎలాంటి అడ్డు కాకూడదని అతనితో ఓ సంతకం పెట్టించాలని ప్రయత్నిస్తాడు వైరా వెంకటస్వామి. రమణ ఆ సంతకం పెట్టాడా లేదా అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే
గతంలో అత్తారింటికి దారేది సినిమాను తిరగరాసి, అత్త స్థానంలో అమ్మను పెట్టి త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. పాతికేళ్లుగా తల్లికి దూరంగా ఉండి పెరిగిన కొడుకు ఒక సంతకంతో దూరమవుతాడు అనే ఐడియాతో ఈ సినిమా చేశాడు త్రివిక్రమ్. అయితే ఆయన గత సినిమాల్లో కథల్లో పెద్ద వైవిధ్యం లేకున్నా, మాటలు, ఎమోషన్స్ మీద సినిమాలను సక్సెస్ చేసుకున్నాడు. అయితే గుంటూరు కారం విషయంలో ఆ మ్యాజిక్ పనిచేయలేదు. తల్లితో హీరోకున్న సంఘర్షణ ఏంటో మొదట్లోనే రివీల్ చేయడం వల్ల మిగతా సినిమా అంతా సంతకం పెట్టడం అనే ఒకే ఒక పాయింట్ తో నడపాల్సివచ్చింది. ఇంత భారీ సినిమాను ఆ ఒక్క పాయింట్ మీద కొనసాగించాలనుకోవడం పెద్ద తప్పిదమే అయ్యింది. కథలోని మిగతా గ్యాప్ ఫిల్లింగ్ లో భాగంగా దర్శకుడు చేసిన ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. హీరోను గుంటూరు నుంచి హైదరాబాద్ వరుస ట్రిప్పులు వేయించడం మధ్యలో ఫైట్ లేదా శ్రీలీలతో ఓ పాట పెట్టడంతో ఈ సినిమా కథ ముగింపుకు వస్తుంది.

దర్శకులను నమ్మే స్టార్ మహేశ్..మరోసారి త్రివిక్రమ్ చెప్పింది చెప్పినట్లు చేశాడు. ఫైట్స్ , పాటలు, యాక్టింగ్, మేకోవర్ లో కొత్తదనం చూపించాడు. చాలా ఎనర్జిటిక్ గా సినిమా అంతా కనిపించాడు. ఎలివేషన్స్, బిల్డప్ సీన్స్ లో మహేశ్ ఆకట్టుకున్నాడు. శ్రీలీలకు చేసేందుకేం లేదు. కేవలం డ్యాన్సులకే పరిమితమైంది. హీరో ఎటు తిరిగితే అటు వెళ్తూ తన క్యారెక్టర్ కు పర్పస్ లేకుండా వ్యవహరించింది. హీరోయిన్ మాత్రమే కాదు విలన్స్ కూడా ఎందుకున్నారో అర్థంకాదు. త్రివిక్రమ్ డైలాగ్స్ పేలలేదు. రీరికార్డింగ్ లో తమన్ తేలిపోయాడు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా కామెడీ అయ్యాయంటే గుంటూరు కారం ఎంతగా బౌన్స్ బ్యాక్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

Hot this week

పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతి

సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్ దొరక్క తనే ప్రొడ్యూసర్ గా మారిన మారుతి..ఈ...

స్పీడు పెంచిన సీనియర్స్..ఇక రచ్చ రచ్చే

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు అగ్రహీరోలు కొన్ని దశాబ్దాలుగా...

రజినీ, మణిరత్నం కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

రజినీకాంత్, మణిరత్నం కాంబోలో రూపొందిన చిత్రం దళపతి. ఈ సినిమా ఎంతటి...

ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్న సిద్దు

సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్...

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.....

Topics

పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతి

సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్ దొరక్క తనే ప్రొడ్యూసర్ గా మారిన మారుతి..ఈ...

స్పీడు పెంచిన సీనియర్స్..ఇక రచ్చ రచ్చే

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు అగ్రహీరోలు కొన్ని దశాబ్దాలుగా...

రజినీ, మణిరత్నం కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

రజినీకాంత్, మణిరత్నం కాంబోలో రూపొందిన చిత్రం దళపతి. ఈ సినిమా ఎంతటి...

ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్న సిద్దు

సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్...

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.....

‘పొట్టేల్’ అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

అజయ్, యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, సాహిత్ మోత్ఖూరి, నిసా...

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి వెర్సటైల్ స్టార్...

‘మా నాన్న సూపర్ హీరో’ ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ : సుధీర్ బాబు

మా నాన్న సూపర్ హీరో' ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ....