కథ
ఇతిహాసాలు రామాయణం.. మహాభారతం ఆధారంగా చాలా కథలు రాసుకున్నారు మన దర్శకులు. ఏదో ఒక పాయింట్ తీసుకుని..ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టు కథనాలు అల్లుకున్నారు. అలా చేస్తే కొత్తేముందనుకున్న నాగ అశ్విన్ మహాభారతంలోని ఘట్టాన్ని లింకప్ చేస్తూ.. సైంటిఫిక్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా ‘కల్కి’ని తీశాడు. మహాభారతంలోని ఒక సంఘటనను బేస్ చేసుకుని కథ అల్లు కోవాలనుకున్న డైరెక్టర్ థాట్ గొప్పది. సినిమా చూస్తున్నంత సేపు దర్శక నిర్మాతలు గుర్తుకొస్తారు. హాలీవుడ్ రేంజ్‌కు ధీటుగా తీయడానికి నాగ అశ్విన్… తెరపై డబ్బులు పరిచేసిన నిర్మాత గుర్తుకొస్తారు.
నటీనటులు:
అమితాబ్ కొన్ని వందల సినిమాలు.. డిఫరెంట్ రోల్స్… పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ పోషించినా… కల్కీలో అశ్వద్ధామ రోలే చాలా పవర్‌ఫుల్. అశ్వద్దామగా ప్రేక్షల మదిలో నిలిచిపోతాడు. ఆయన కెరీర్‌లో టాప్ రోల్స్ ఒకటిగా వుండిపోతుంది. దీపిక పదుకునే సుమతిగా… దేవుడిని జన్మనిచ్చే తల్లిగా పెర్‌పార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఇక భైరవ రోల్లో ప్రభాస్ ఎంటర్‌టైన్ చేసి.. క్లైమాక్స్‌లో తనెవరో చెప్పి షాక్ ఇచ్చాడు. కమల్‌హాసన్ కనిపించేది తక్కువ సేపే అయినా… గెటప్‌తో ఆకట్టుకున్నాడు.
మహాభారతంలోని పాత్రలను ఇప్పటి రోల్స్‌తో లింక్ చేసిన దర్శకుడు.. అశ్వద్దామ మినహా మిగతా క్యారెక్టర్స్ ఎలా వచ్చాయో చెప్పలేదు. విలన్ సుప్రీమ్ ( కమల్‌హాసన్) రోల్ కూడా మహాభారతంతో ఎలాంటి సంబంధం ఏంటి? వీటన్నింటికీ పార్ట్2లో క్లారిటీ ఇస్తాడేమో. కథను మహాభారతంతో లింక్ చేయడంతో.. ప్రేక్షకుడికి వచ్చే అనుమానాలకు.. వేసే క్వశ్చన్స్‌కు ఆన్సర్ పార్ట్2లో చెబుతారేమో. అంతా బాగానే వున్నా… మూడు గంటల లెంగ్త్‌ను ఓ పావుగంట ట్రిమ్ చేసే అవకాశం వున్నా చేయలేదు. ప్రభాస్ ఇంట్రడక్షన్ ఫైట్.. మధ్యలో ఛేంజింగ్ సీన్‌ను తగ్గిస్తే బాగుండేది. ఓవరాల్‌గా కల్కి అద్భుతమేగానీ.. ఒకసారి చూడడానికే.
ప్లస్ పాయింట్స్
కథ
అమితాబ్ క్యారెక్టర్
ప్రభాస్ & అమితాబ్ మధ్య వచ్చే సన్నివేశాలు
దీపికా
RGV, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ గెస్ట్ అప్పియరెన్స్
నోట్: గ్రాఫిక్స్ పిల్లలకు నచ్చుతాయి.. ఇప్పుడు ఉన్న యూత్ కు మహా భారతం గురుంచి ఆలోచించే విధంగా చేసే ప్రయత్నం.ఓవరాల్ గా దర్శకుడి కి హాట్స్ ఆప్…
రేటింగ్ : 4/5
ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే