నటీనటులు.. వరుణ్ సందేశ్, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య, అన్ని ,శ్రేయా రాణి రెడ్డి
మ్యూజిక్- సంతు ఓంకారం
సినిమాటోగ్రఫీ – రమిజ్ నవీత్
నిర్మాత, డైరెక్టర్ : రాజేశ్ జగన్నాథం
హ్యాపీ డేస్ , కొత్త బంగారు లోకం సినిమా తరువాత పెద్దగా సక్సెస్ చూడని వరుణ్ సందేశ్.. వరసగా సినిమాలు చేస్తేనే ఉన్నారు…కానీ ఏదీ అతనికి కలిసిరాలేదు.. ఈ మధ్య కాలంలో ఎంతో ఆశలు పెట్టుకొని చేసిన మైకేల్ , ఇందువదన కూడా వరుణ్ సందేశ్కు హెల్ప్ కాలేదు.. చాలా ఏళ్ల తరువాత వచ్చిన సినిమా నింద.. ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు వరుణ్. మరి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకూ నచ్చుతుందో చూడాలి..ముఖ్యంగా కథ విషయానికి వస్తే…
కథ
వివేక్ ( వరుణ్ సందేశ్ ) మానవ హక్కుల సంస్ధలో పనిచేస్తూ అమాయకుల తరపున వారికి శిక్షలు పడకుండా పనిచేస్తుంటాడు..వివేక్ తండ్రి ( తనికెళ్ల భరణి) ఓ జడ్జి.. కాండ్రకోట కు సంబంధించిన ఓ కేసులో సాక్ష్యాల ఆధారంగా తీర్పు ఇచ్చాను… కానీ అతని చూపులు నన్ను నిద్రపట్టనివ్వడంలేదు.. అంటూ కన్నుమూస్తారు.. ఆ కేస్ ను టేకప్ చేసిన వివేక్ ఏం చేసాడు ..ఎలా అసలు నేరస్ధులకు శిక్ష పడేలా చేస్తారు అనేది మెయిన్ ప్లాట్ .
స్క్రీన్ ప్లే – టెక్నికల్ టీం
ఇటువంటి కథలు తీసుకున్నప్పుడు స్క్రీన్ చాలా టైట్‌గా ఉండాలి.. ప్రతిక్షణం ఆడియన్స్ ను పక్కకు చూడకుండా ఏమి జరుగుతుందో అని టెంక్షన్‌లో పడేస్తేనే ఇటుంవంటి థ్రిల్లర్స్ వర్క్ అవుట్ అవుతాయి.. ఈ విషయంలో దర్శకుడికి మొదటి సినిమానే అయినా బాగానే హ్యాండిల్ చేసాడు అని చెప్పుకోవచ్చు.. ఈస్ట్ గోవావరి జిల్లా లోని కాండ్రకోటలో జరిగే ఓ మర్డర్ మిస్టరీని చాలా తెలివిగా, కథ ఎక్కడా డీవియేట్ కాకుండా , తనకు ఉన్న బడ్జెట్‌లో నీట్‌గా బోరులేకుండా తెరకెక్కించారు. ఎక్కడో కాండ్రకోటలో జరిగిన మర్డర్‌కు ఢిల్లీలో ఉన్న వరుణ్ సందేశ్‌కు లింక్ కలపడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు.. ఇక మొదటి నుండి కూడా కిడ్నాప్ డ్రామా ఉన్నా అది ఎక్కడ లౌడ్ గా లేకుండా .. బోరు కొట్టింటే భారీ యాక్షన్ సీన్స్ లేకుండా చిన్న సెటప్ వేసుకొని తను చెప్పవలసింది ఒక నిర్మాతగా , దర్శకుడుగా సక్సెస్ అయ్యారు రాజేష్ జగన్నాథం. ఒకటి రెండు సీన్స్ తప్ప ఎక్కడ ఊరి దాటి బయటకు వెళ్లలేదు…కనుక గోవారి జిల్లాలో ఏ ఫ్రేమ్ పెట్టినా పచ్చగానే కనిపిస్తుంది..అయినా తనకు ఉన్న లిమిట్స్‌లో సినిమాటోగ్రాఫర్ రమిజ్ నవీత్ బాగానే చేసాడు..ఇక ఇటువంటి థ్రిల్లర్స్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం.. సంగీత దర్శకుడు సంతు ఓంకార్ మొటిటి షాట్ నుండి క్లైమాక్స్ వరకూ ప్రాణం పెట్టాడు అని చెప్పవచ్చు.
నటీనటుల విషయానికి వస్తే..
ఇప్పటివరకూ లవర్ బాయ్‌గా కనిపించిన వరుణ్ సందేశ్‌కు ఇది కొత్త క్యారెక్టర్ అనుకోవచ్చు..వరుణ్ సందేశ్ గతం లో చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా బెటర్.. వివేక్ పాత్రలోవరుణ్ షటిల్ ఫెర్ఫామెన్స్‌తో మెప్పాంచాడు.. ఇక సినిమాలో కథ మెత్తం తిరిగేది బాలరాజు పాత్ర చుట్టూనే..ఈ పాత్ర చేసిన చత్రపతి శేఖర్ పాత్ర చూస్తే జాలి అనిపిస్తుంది..హీరోయిన్ ఉన్నా ఎక్కువ స్కోప్ లేదు…ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆని … బాలనటిగా మెప్పించిన ఆనీ ఇటీవల హీరోయిన్‌గా కూడా చేస్తుంది..ఈ సినిమా లో ఆని నటనకు ప్రేక్షకులకు ఫిదా అవుతారు.
ప్లస్ పాయింట్స్
కథ- కథనం
మ్యూజిక్
వరుణ్ సందేశ్ నటన
ఆనీ నటన
కాంపాక్ట్ బడ్డెట్‌లో తెరకెక్కిన విధానం
మైనస్ పాయింట్స్
సినిమా లెంగ్త్
కామెడికి స్కోప్ లేకపోవడం
ట్యాగ్- వరుణ్ సందేశ్ మీద నింద లేకుండా జాగ్రత్త పడ్డాడు.
రేటింగ్- ఇది నా వ్వక్తిగత అభిప్రాయం
2.5
ఇది నా వ్వక్తిగత అభిప్రాయం మాత్రమే
రివ్వూ బై snr talks