నటీనటులు:
రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు
సాంకేతిక బృందం
సంగీతం: శరవణ వాసుదేవన్, డైలాగ్స్: లక్ష్మీ లోహిత్ పూజారి, ఎడిటర్: సత్య గిద్దుటూరి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, నిర్మాత: ధ్యాన్ అట్లూరి, రచన-దర్శకత్వం: వెంకట సత్య
ఈవారం థియేటర్స్ లోకి వచ్చిన సినిమాల్లో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన సినిమా ఆపరేషన్ రావణ్. టీజర్, ట్రైలర్ తో ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్ జంటగా దర్శకుడు వెంకట సత్య ఆపరేషన్ రావణ్ సినిమాను రూపొందించారు. తాజాగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
స్టోరీ
సైకో థ్రిల్లర్ చేసే వరుస హత్యలు నగరంలో సంచలనం సృష్టిస్తుంటాయి. పై స్థాయి పోలీస్ అధికారుల నుంచి కింద స్థాయి వరకు ఈ క్రైమ్స్ టెన్షన్ పడేలా చేస్తాయి. కేవలం అమ్మాయిలను, అది కూడా చేతికి గోరింటాకు పెట్టుకున్న అమ్మాయిలనే సైకో చంపుతుంటాడు. ఈ సైకో ఎవరు, ఎందుకిలా చేస్తున్నాడు. అతని వలలో పడిన తన ప్రేయసి ఆమని (సంగీర్తన విపిన్ )ని హీరో రామ్ (రక్షిత్ అట్లూరి) ఎలా దక్కిచుకున్నాడు అనేది అనేక మలుపులతో సాగే ఇంట్రెస్టింగ్ కథ.
విశ్లేషణ
మీ ఆలోచనలే మీ శత్రువులు అనే కాన్సెప్ట్ ను చాలా క్రియేటివ్ గా తెరపై చూపించిన సినిమా ఆపరేషన్ రావణ్. ఈ క్రెడిట్ పూర్తిగా దర్శకుడు వెంకట సత్యకే ఇవ్వాలి. ఆయన మంచీ చెడులను విజువలైజ్ చేసిన విధానం సరికొత్తగా ఉంది. ఈ కథలో రామాయణం స్ఫూర్తి కనిపిస్తుంటుంది. రామ్, ఆమని లవ్ స్టోరీతో మెల్లిగా కథను ప్రారంభించిన దర్శకుడు మరోవైపు సైకో హత్యలతో సీరియస్ నెస్ తీసుకొచ్చాడు. ఈ సైకో ఎవరు ఎందుకు హత్యలు చేస్తున్నాడనేది సెకండాఫ్ లో ఆకట్టుకునేలా చూపించాడు. ఆ పాయింట్ కు సరైన జస్టఫికేషన్ ఇచ్చాడు. మనలో మంచీ చెడూ రెండూ ఉంటాయని, మంచిని చెడు డామినేట్ చేసినప్పుడే సైకో తయారవుతాడని చెప్పిన పాయింట్ బాగుంది.
చదవండి: రాయల్ “రాయన్” రివ్యూ
ఆర్టిస్టుల పరంగా చూస్తే రక్షిత్ తెరపై స్టైలిష్ గా కనిపించాడు. మంచి యాక్షన్ సీక్వెన్సులు చేశాడు. ఓ పాటలో క్యూట్ స్టెప్స్ తో ఆకట్టుకున్నాయి. హీరోయిన్ సంగీర్తన విపిన్ మంచి పర్ ఫార్మెన్స్ ఇచ్చింది. చాలా న్యాచురల్ గా కనిపించింది. టీవీ రిపోర్టర్ గా ఆకట్టుకుంది. రాధిక పాత్ర ఆమె కెరీర్ లో గుర్తుండిపోతుంది. ఈ మధ్య కాలంలో ఆమె ఇలాంటి ఎమోషనల్, జెన్యూన్ రోల్ లో నటించలేదు. రఘు కుంచె చేసిన మినిస్టర్ క్యారెక్టర్ చిన్నదైనా ఇంపాక్ట్ ఉంది. సైకో క్యారెక్టర్ కూడా గుర్తుండిపోయేలా ఉంది. టెక్నికల్ గా స్ట్రాంగ్ మూవీ ఇది.
ప్రేమించడం, ప్రేమను ఆశించడంలో నేటి సమాజంలో జరుగుతున్న ఘటనలకు అద్దం పట్టేలా ఉన్న ఆపరేషన్ రావణ్ రూపొందింది. సకుటుంబంగా ఈ మూవీని చూసేందుకు ఆడియెన్స్ నిరభ్యంతరంగా వెళ్లవచ్చు.
రేటింగ్ 3/5