కథ విషయానికి వస్తే..
తాగి పబ్లిక్ ను డిస్ట్రబ్ చేస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్తారు పోలీస్ కానిస్టేబుల్ రామ్ ప్రసాద్ (షకలక శంకర్), ఎస్ఐ (బ్రహ్మాజీ). పోలీసులు అతనితో మాట్లాడుతుండగా..తన పేరు ప్రసాద్ అని, తానెందుకు ఇలా తాగాల్సివచ్చిందో వివరిస్తాడు ఆ వ్యక్తి. అక్కడి నుంచి ప్లాష్ బ్యాక్ లోకి కథ వెళ్తుంది. ప్రసాద్ చెప్పిన కథలోని ఫ్రెండ్ పేరు కార్తీక్ (విజయ్ శంకర్). సివిల్ ఇంజినీర్ గా వర్క్ చేస్తుంటాడు. అతను ప్రియ (విషిక) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కార్తీక్ కు వెంటనే ఓకే చెప్పదు. కొద్ది రోజులు వెంట తిప్పించుకుందాం, ఇతని ప్రేమ ఎంత స్ట్రాంగో చూద్దాం అనుకుంటుంది. ఈ క్రమంలో కార్తీక్ ను ముప్పుతిప్పులు పెడుతుంది. కార్తీక్ భరిస్తాడు. కానీ ప్రియను ఏమీ అనడు. కానీ ఓ విషయంలో కార్తీక్ హర్ట్ అవుతాడు. ప్రియ చేసిన ఆ తప్పేంటి, చివరకు ప్రియ, కార్తీక్ ఒక్కటయ్యారా లేదా, ఈ కథలో కార్తీక్ సోదరి అమృత, ప్రియ బ్రదర్ మనోజ్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేది తెరపై చూడాల్సిన మిగిలిన కథ
విశ్లేషణ
థియేటర్‌లోకి వచ్చే ప్రేక్షకులకు కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్. అది పూర్తిస్థాయిలో ఇచ్చే పడేశాడు మన డైరెక్టర్ రాజేశ్. పాగల్ వర్సెస్ కాదల్ పేరిట వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వంచి తెగ ఎంటర్‌టైన్ చేసింది. కార్తీక్, ప్రియ, అమృత, మనోజ్ అనే నాలుగు మెయిన్ క్యారెక్టర్స్‌ను డిఫరెంట్ గా డిజైన్ చేశాడు దర్శకుడు రాజేశ్ ముదునూరి. వారి క్యారెక్టర్స్ లోని కొత్తదనమే ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా చేసింది. నేటితరం ప్రేమికులు బాగా కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ సినిమాలో ఈతరం ప్రేమికులు తమని తాము చూసుకున్నట్లు ఉంటుంది. ప్రతి లవర్ ఈ మూవీతో రిలేట్ అవుతారు. చాలా జెన్యూన్ అంటెంప్ట్ ఈ సినిమా. పెళ్లి చూపులు టైప్ లో హాయిగా ప్లెజెంట్ గా సాగుతుంది. ప్రియ క్యారెక్టర్ చేస్తున్న శాడిజం కొన్నిసార్లు మనకు కూడా కోపం తెప్పించేలా ఉన్నా..దాన్ని కూడా కామెడీగా మార్చేసి ఎంటర్ టైన్ చేశారు.
కార్తీక్ పాత్రలో విజయ్ శంకర్ అద్భుతంగా నటించాడు. కామెడీ, ఎమోషన్, లవ్, ఇన్నోసెంట్ యాక్టింగ్ తో అన్ని భావోద్వేగాలు తన నటనలో చూపించాడు. నటుడిగా విజయ్ మెచ్యూరిటీకి పాగల్ వర్సెస్ కాదల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. ముందు ముందు ఇలాంటి ఎన్నో పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ ఆయన చేస్తాడని ఆశించవచ్చు. ప్రియ పాత్ర విషిక కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది. ఆమె చూడటానికి కూడా అలాగే సైకో లవర్ లా అనిపించేలా నటించింది. మనోజ్ పాత్రలో ఈగోకు మారుపేరులా కనిపించాడు ప్రశాంత్. అమృత పాత్రలో మంచి చెల్లిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకునేలా ఉంది అనూహ్య సారిపల్లి నటన.
మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. యంగ్ ప్రొడ్యూసర్ పడ్డాన మన్మధరావు మరో మంచి మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమాలో ఎక్కడా అసభ్యత, అశ్లీలత కనిపించదు. ఫ్యామిలీతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా పాగల్ వర్సెస్ కాదల్ మూవీని చూడొచ్చు.
(గమనిక – ఈ మూవీ రివ్యూ ప్రేక్షకుడి అభిప్రాయ పరిధిలోనిది మాత్రమే)