దిగ్గజ గీత రచయితల సమక్షంలో “రేవు” సినిమా ఆడియో రిలీజ్

Spread the love

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ సూపర్ విజన్ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా ఆగస్టు రెండో వారంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. గీత రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్ అతిథులుగా ఈ రోజు హైదరాబాద్ లో రేవు సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

గీత రచయిత చంద్రబోస్ మాట్లడుతూ – రేవు సినిమా ఆడియో ఫంక్షన్ కు మా ప్రభు అన్న పిలిస్తే వచ్చాను. ఇక్కడికి వచ్చి ఈ సినిమా పాటలు విన్న తర్వాత సరైన కార్యక్రమానికే వచ్చాను అనిపించింది. అశోక్ తేజ గారిని చూసి చాలా రోజులవుతోంది. అలాగే అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రి గారిని ఈ వేదిక మీద కలుసుకోవడం సంతోషంగా ఉంది. రేవు సినిమాకు పాటలు రాసిన ఇమ్రాన్ శాస్త్రి పేరు ఎంత వైవిధ్యంగా ఉందో అతను రాసిన పాటలు అంతే వైవిధ్యంగా ఉన్నాయి. అన్నిఎమోషన్స్ తో పాటలు రాశారు. సంగీతం బాగుంది. రేవు సినిమాలో నవ్యత, నాణ్యత రెండూ కనిపించాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ – రేవు పాటల విన్నాక ఒక ఉద్విగ్నతకు లోనయ్యాను. అంత బాగున్నాయి. మనం కంటెంట్ ఉన్న వైవిధ్యమైన సినిమాలు కావాలంటే పర భాషల వైపు చూస్తుంటాం. కానీ రేవు సినిమా పాటలు విన్నాక కొత్తతరం ప్రతిభావంతులపై నమ్మకం ఏర్పడుతోంది. రేపటి తెలుగు సినిమా బాగుంటుందని అనిపిస్తోంది. ఇది మా దమ్ము అంటూ పాటల్ని చూపించి ఇది అనిపించుకున్నారు రేవు టీమ్. లిరిసిస్ట్ ఇమ్రాన్, మ్యూజిక్ చేసిన జాన్ కు కంగ్రాట్స్. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే దర్శకుడు హరినాథ్ కు శుభాకాంక్షలు. తెలుగు సంగీత దర్శకులకు అవకాశాలు రావాలి అప్పుడే మనవారి ప్రతిభ తెలుస్తుంది. ఈ సినిమాలో కొన్ని పాటలు లిరిక్స్ కు ట్యూన్ చేశారని తెలిసింది. ఇంకా సంతోషం. ఈ రేవు సినిమా బాక్సాఫీస్ వద్ద రేవెట్టాలని కోరుకుంటున్నా. ఈ సినిమాకు సారథ్యం వహిస్తున్న ప్రభు గారికి, పర్వతనేని రాంబాబు గారికి, ఇతర టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

చదవండి: “పురుషోత్తముడు” క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటున్న దర్శక నిర్మాతలు

రేవు సినిమా నిర్మాణ పర్యవేక్షకులు ప్రభు మాట్లాడుతూ – నా మీద అభిమానంతో ఈ రోజు రేవు సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన మా చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రి గార్లకు థ్యాంక్స్. తెలుగు పాటకు పట్టం కట్టిన గొప్ప గీత రచయితలు వీరంతా. ఈరోజు ఒక చిన్న సినిమాను సపోర్ట్ చేసేందుకు రావడం సంతోషంగా ఉంది. రేవు సినిమా పెద్ద కమర్షియల్ హంగులు ఉన్న మూవీ కాదు. ఇదొక జీవన పోరాటం. మత్య్సకారుల జీవితాలను తెరపై చూపిస్తుంది. మా దర్శకుడు హరినాథ్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ నుంచి తీసుకున్న వర్క్ స్క్రీన్ మీద మనందరినీ ఇంప్రెస్ చేస్తుంది. వారు రూపాయి రూపాయి కూడబెట్టి ఈ సినిమా చేశారు. మా మిత్రుడు డా.మురళీ గింజుపల్లి గారి నిర్మాణంలో రేవు సినిమా మీ ముందుకు వస్తోంది. నా మిత్రుడు పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరి సపోర్ట్ రేవు సినిమాకు ఉండాలని కోరుకుంటున్నా.అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ – మా రేవు సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి వచ్చిన గీత రచయితలు చంద్రబోస్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, కాసర్ల శ్యామ్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, అనంత్ శ్రీరామ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. భవిష్యత్ లో వీరితో కూడా పనిచేసే అదృష్టం కలగాలని ఆశిస్తున్నా. రేవు సినిమాకు మా మిత్రుడు మురళీ గింజుపల్లి గారు, నవీన్ పారుపల్లి గారు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా రేవు సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తున్నాం. రేవు మూవీ మంచి సక్సెస్ కావాలని, ఈ బ్యానర్ లో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.

Hot this week

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...

Topics

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...