స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు అషికా రంగనాథ్ కు టాలీవుడ్ లో అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కాజల్, తమన్నా, పూజా హెగ్డే లాంటి హీరోయిన్స్ క్రేజ్ తగ్గిపోవడం, అలలా ఎగిసిన మృణాల్, శ్రీలీలకు కూడా సక్సెస్ కంటిన్యూ కాకపోవడంతో ఇప్పుడు మరొక అందమైన హీరోయిన్ కావాల్సిన స్కోప్ కనిపిస్తోంది. ఆ అవకాశం ఆషికా రంగనాథ్ కు దక్కే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. స్టార్ హీరోల సరసన నటించగలిగే అట్రాక్షన్ ఆమెలో ఉందనే టాక్ వినిపిస్తోంది.
అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అషికా రంగనాథ్. మొదటి సినిమాతోనే చూడగానే ఆకట్టుకునేలా ఉందనే పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా నాగార్జున సరసన నటించిన నా సామి రంగ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించుకోవడంతో ఆమె పేరు క్రేజీ హీరోయిన్స్ లిస్టులో చేరింది. అటు శ్రీలీల చేసిన సినిమాలన్నీ బౌన్స్ అవడం, మృణాల్ కు అన్ని రకాల క్యారెక్టర్స్ సెట్ కాకపోవడంతో…అషికా లాంటి హీరోయిన్ కావాలనే అవసరం ఏర్పడుతోంది. ఈ టైమ్ లో ఆమెకు లక్ కూడా కలిసిరావాల్సి ఉంది.