యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరింది. రానా హీరోగా దర్శకుడు తేజ రూపొందిస్తున్న రాక్షస రాజు సినిమాలో హీరోయిన్ గా ఈ భామనే సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. చి.ల.సౌ, హిట్ సినిమాలతో సక్సెస్ అందుకున్న రుహానీ శర్మ ఇటీవల వెంకటేష్ సైంధవ్ మూవీలో కీ రోల్ చేసింది. ఆ మధ్య రుహానీ హర్ ఛాప్టర్ 1 అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో లీడ్ రోల్ చేసింది.
ఇప్పుడు రాక్షస రాజులో హీరోయిన్ గా ఎంపికవడం ఆమెకు మంచి ఛాన్స్ అనే చెప్పాలి. గతంలో రిలీజై సక్సెస్ అయిన నేనే రాజు నేనే మంత్రి సినిమాకు సీక్వెల్ గా రాక్షస రాజు సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు రాక్షస రాజులో రుహానీకి కూడా అలాంటి ప్రాధాన్యత ఉంటుందో చూడాలి. ప్రస్తుతం రాక్షస రాజు సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది.