టాలీవుడ్ నుంచి వస్తున్న మరో బిగ్ టికెట్ మూవీ పుష్ప 2. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 6న థియేటర్స్ లోకి రానుంది. అయితే మేకర్స్ చెప్పినట్లు డిసెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ కావడంలేదనే రూమర్స్ ఆగడం లేదు.
పుష్ప 2 ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు అల్లు అర్జున్ కు దగ్గరైన వారు కూడా పుష్ప 2 డిసెంబర్ 6నే రిలీజ్ అంటూ మరీ మరీ చెబుతున్నారు. అయితే బాలీవుడ్ మీడియాలోనూ పుష్ప 2 రిలీజ్ వచ్చే సమ్మర్ కే అనే రూమర్స్ వస్తున్నాయి. చిన్న గ్యాప్ తర్వాత పుష్ప 2 షూటింగ్ మళ్లీ వేగంగా జరుగుతోంది.
చదవండి: ప్రభాస్ “ఫౌజీ”కి ముహూర్తం ఫిక్స్
అయితే ఇంకా చేయాల్సి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అంచనా వేసుకుంటే డిసెంబర్ 6న రిలీజ్ కాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చినా నమ్మకం కుదరడం లేదంటే కారణం ఇప్పటికే పుష్ప 2 వాయిదా పడటమే. పుష్ప 2 నే కాదు ఈ ఏడాది చాలా పెద్ద సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. ఎలక్షన్స్, ఎండలు అంటూ చాలా కారణాలు ఇండస్ట్రీ నుంచి వినిపించాయి. ఏమైనా పుష్ప2 డిసెంబర్ 6న వస్తే ఆల్ హ్యాపీ అనుకోవాలి.