మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ రెమ్యునరేషన్ కోసం సినిమా వదులుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతోంది. దర్శకుడు సంపత్ నందితో గాంజా శంకర్ అనే సినిమా చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్, మ్యూజికి సిట్టింగ్స్ జరిగాయి. షూటింగ్ కు ఏర్పాట్లు చేశారు. సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజున గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఉన్నట్లుండి ఆగిపోవడం సర్ ప్రైజింగ్ న్యూస్ అయ్యింది.
గాంజా శంకర్ సినిమాకు సాయి ధరమ్ తేజ్ అడిగిన భారీ రెమ్యునరేషన్ వల్లే సినిమా సితార సంస్థ రద్దు చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సాయి తేజ్ దాదాపు 15 కోట్ల రూపాయల ఫీజు అడిగాడట. గతేడాది విరూపాక్ష సినిమా హిట్ కావడంతో అమాంతం తన ఫీజును పెంచేశాడు. విరూపాక్ష లాంటి సక్సెస్ అన్ని సినిమాలకు వస్తుందని చెప్పలేం. అందుకే 15 కోట్ల రూపాయలు సాయిధరమ్ తేజ్ కు ఇచ్చేందుకు ప్రొడ్యూసర్స్ అంగీకరించలేదట. దాంతో గాంజా శంకర్ ఎక్కడి పనులు అక్కడ ఆపేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా కలిసినప్పుడు చిరంజీవికి కూడా జరిగిన విషయం చెప్పారట డైరెక్టర్ సంపత్ నంది.