స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సోదరి పూజ ఎంగేజ్ మెంట్ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోస్ లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఓ వీడియోలో సాయి పల్లవి స్టెప్స్ వేయడం కూడా ఫ్యాన్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. పూజ తన ఇన్ స్టాగ్రామ్ అక్కౌంట్ ద్వారా షేర్ చేసింది. ఆమె ఎంగేజ్ మెంట్ రెండు రోజుల కిందటే జరిగింది.
సాయి పల్లవి లాగే పూజ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ సినిమాల్లో పేరు తెచ్చుకుంది. వినీత్ అనే అబ్బాయిని ప్రేమించింది. ఇతనితో పెళ్లికి సిద్దమైంది. రెండేళ్ల కిందటి నుంచి ఆమె పెళ్లికి సంబంధించిన టాక్స్ జరుగుతున్నాయి. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పూజ పెళ్లి చేసుకుంటోంది. త్వరలో ఆమె వెడ్డింగ్ డేట్ పెట్టుకోనున్నారు. ఇక పెళ్లికి సాయి పల్లవి వంతు మాత్రమే మిగిలి ఉంది.