సాయి ధరమ్ తేజ్ సాయి దుర్గ తేజ్ గా పేరు మార్చుకుని కొత్త ప్రాజెక్ట్ లతో తన లక్ పరీక్షించుకుంటున్నాడు. ఇతనిలా పేర్లు మార్చుకున్న మరో హీరో తెలుగులో లేడు. సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా పోస్టర్ ఇవాళ రిలీజైంది. ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎస్ డీటీ 18 పేరుతో ఈ హీరో కొత్త సినిమా తెరకెక్కుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర అనౌన్స్ మెట్ పోస్టర్‌లో ల్యాండ్ మైన్‌లతో చుట్టుముట్టబడిన ఎడారి భూమిలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ ఆసక్తికలిగిస్తోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారులో ఓ భారీ సెట్ వేశారు. ఈ సెట్ లోనే గత రెండు వారాలుగా షూటింగ్ జరుగుతోంది. ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. సాయి దుర్గతేజ్ కొత్త సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.