వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు వచ్చేసింది. ఇవాళ్టి నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా వెంకటేష్ ఇన్నేళ్ల కెరీర్ లో చేసిన ఫస్ట్ కైమ్ థ్రిల్లర్. సైంధవ్ ఓటీటీ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా థియేటర్స్ లోకి వచ్చింది. సైంధవ్ థియేటర్స్ లో ఆశించినంత సక్సెస్ కాలేకపోయింది.
అయితే ఇప్పుడు ఓటీటీలోనా సైంధవ్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్స్ కు ఆదరణ ఉంటుంది కాబట్టి ఇక్కడ మంచి నెంబర్స్ రాబడుతుందని వెంకీ ఆశిస్తున్నాడు. సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో దర్శకుడు శైలేష్ కొలను రూపొందించారు. వెంకటేష్ 75వ మూవీగా సైంధవ్ పై బాగా హైప్ క్రియేట్ అయ్యింది. తీరా సినిమా రిలీజ్ అయ్యాక అంచనాలు మాత్రం అందుకోలేకపోయింది.