వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ్ సినిమా ట్రైలర్ కు డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను ఎల్లుండి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 13న సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కు సైంధవ్ రెడీ అవుతోంది. ఈ సినిమాను నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్నారు.
క్రైమ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా సైంధవ్ తెరకెక్కుతోంది. వెంకటేష్ నటిస్తున్న 75వ సినిమాగా సైంధవ్ ఒక ప్రత్యేకత తెచ్చుకుంది. రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుండటంతో ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ పెంచారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ అతిథిగా నిర్వహిస్తారని తెలుస్తోంది. పవన్ వస్తే సైంధవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు క్రేజ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు.