వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకుంది. అమోజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా వచ్చే నెల 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని అమోజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. సంక్రాంతికి సైంధవ్ థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాను నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో దర్శకుడు శైలేష్ కొలను రూపొందించారు.
వెంకటేష్ 75వ సినిమా తెరకెక్కింది సైంధవ్. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. కూతురు ప్రాణాలను కాపాడుకునేందుకు విలన్స్ తో సైంధవ్ చేసిన పోరాటం ప్రేక్షకులకు ఎగ్జైట్ మెంట్ ఇవ్వలేదు. పాత కథ, ఫ్యామిలీ ఎమోషన్ కనెక్ట్ కాకపోవడంతో థియేటర్స్ లో పెద్ద రెస్పాన్స్ రాలేదు. ఓటీటీలో ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్స్ కు ఆదరణ ఉంటుంది కాబట్టి…పాజిటివ్ గా రెస్పాన్స్ ఉంటుందని టీమ్ ఆశిస్తున్నారు.