సలార్ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను మూవీ టీమ్ ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సెలబ్రేషన్స్ లో ప్రభాస్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ వై రవిశంకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. సలార్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో కేక్ కటింగ్ చేస్తూ టీమ్ అంతా నవ్వులతో హ్యాపీగా కనిపించారు.
బాక్సాఫీస్ వద్ద సలార్ పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. వరల్డ్ వైడ్ గా దాదాపు 700 కోట్ల రూపాయల వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంది. నైజాంలో వంద కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది. అలాగే కర్నాటకలో హయ్యెస్ట్ నాన్ కన్నడ మూవీగా నిలిచింది. నేషనల్ వైడ్ షారుఖ్ డంకీ సినిమాను దాటేసే వసూళ్లు సలార్ కు రావడం విశేషం.